11-04-2025 12:00:00 AM
బీసీ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ తిరుపతి
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని బీసీ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ తిరుపతి అన్నా రు. గురువారం ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శిం చారు. డార్మెంటరీ, వంటశాల, నిత్యావసర సరుకులను పరిశీలించారు.
విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం సిబ్బందితో సమీక్షించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రత్నాబాయి, ఉపాధ్యా యునిలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.