calender_icon.png 24 October, 2024 | 4:08 AM

పేదలకు నాణ్యమైన విద్య

24-10-2024 02:18:22 AM

  1. భవిష్యత్ నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యమివ్వాలి
  2. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి, వైస్‌చైర్మన్ ఐ పురుషోత్తంను బుధవారం మందకృష్ణ మాదిగ వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. గడిచిన పదేండ్లలో అణగారిన వర్గాలకు విద్య దూరమైందన్నారు.

విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను, ఆరకొర వసతుల మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వం మాదిగలకు ప్రాధాన్యం కల్పించడం సంతోషకరమైన అంశమన్నారు.

ప్రభుత్వ నియామకాల్లోనూ సముచిత ప్రాధాన్యం కల్పించాలని మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ, జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహ మాదిగతో పాటు నాయకులు అనిల్, కోటి పాల్గొన్నారు.