calender_icon.png 4 March, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం అందించాలి

03-03-2025 10:10:55 PM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ...

ముషీరాబాద్ (విజయక్రాంతి): నాణ్యమైన విద్యా, ఉచిత వైద్యాన్ని పేదలకు అందించినప్పుడే సమాజం ఉన్నత స్థితివైపు పయనిస్తుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. స్వచ్చంద సంస్థలు ప్రభుత్వాలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం కవాడిగూడ డివిజన్ రోటరీ కాలనీలో బండారు వైష్ణవ్ జయంతిని పురస్కరించుకోని బండారు వైష్ణవ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువతకు నైపుణ్యం, ఉపాధికల్పన, ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో నిజమైన ప్రగతిని సాధిస్తాయని అన్నారు.

రాజకీయ నాయకులు సమాజ సేవే లక్ష్యంగా రాజకీయాలు చేయాలి తప్పా వ్యక్తిగత అభివృద్ధికోసం రాజకీయాలలోకి రావద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఎలాంటి పూచీకత్తు లేకుండా సామాన్య ప్రజలు చిన్న చిన్న వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూత అందించడం అభినందనీయం అన్నారు. వచ్చే ఏప్రిల్ 14 నాటికి రోటరీ కాలనీలోని సిమెంట్ విగ్రహంగా అంబేద్కర్ విగ్రహ స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసి అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బండారు వైష్ణవ్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, కార్పొరేటర్లు జి.రచనశ్రీ, సుప్రియా నవీన్ గౌడ్, పావని వినయ్ కుమార్, సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, ముషీరాబాద్ కన్వీనర్ రమేష్ రాం, బీజేపీ రాష్ట్ర నాయకులు జి.వెంకటేష్, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, పరిమళ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సలంద్రి దిలీప్ యాదవ్, నగర నాయకులు మహేందర్ బాబు, ఏ.ప్రభాకర్ గంగపుత్ర, బోల్ల రమేష్, రోటరీ కాలనీ అధ్యక్షుడు బండారు యాదగిరితో పాటు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరంలో వైద్యపరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు.