calender_icon.png 2 April, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపం

31-03-2025 11:12:37 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): వేమనపల్లి మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల అభివృద్ధి కొరకు మంజూరయిన 80,00,000 లక్షల రూపాయలతో పలు గ్రామాలలో చేపడుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఏట మధుకర్ ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సీ వాడలో సీసీ రోడ్డును పరిశీలించారు. నాసిరకం ఇసుకను వాడుతున్నారని, మట్టి కలిసిన ఇసుకను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

రోడ్డు కొలతలకు తగినట్లు ఉండటం లేదని తెలిపారు. రోడ్డు వెడల్పు ఉన్నపటికీ మధ్యలో ఇసుకను పోసి రోడ్డు కాంక్రీట్ మందాన్ని తగ్గిస్తున్నారని, అదేవిధంగా రోడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు దానికి ప్రతిరోజు నీళ్ళను క్యూరింగ్ చేయడం లేదని ఆరోపించారు. దీంతో వేసవలో పగుళ్లు ఏర్పడి రోడ్డు పూర్తిగా చెడిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నత అధికారులకు, క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వేమనపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏటా మధుకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, ఏనుముల వెంకటేష్, కంపెల అజయ్ కుమార్, కోయిల స్వామి, చౌదరి మధునయ్య తదితరులు పాల్గొన్నారు.