calender_icon.png 15 November, 2024 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని సాధించాలి

14-11-2024 01:04:42 PM

-ఏరియా ఇన్చార్జి జిఎం విజయ్ ప్రసాద్ 

మందమర్రి, (విజయక్రాంతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణిలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని సాధించి మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడాలని ఏరియా ఇన్చార్జి ప్రసాద్ అన్నారు. గురువారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు-2024 కార్యక్రమానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు.

సింగరేణి సంస్థ దక్షిణ భారత దేశంలోనే అగ్రగామి బొగ్గు ఉత్పత్తి సంస్థగా దేశంలోని వివిధ సంస్థలకు ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నాణ్యమైన బొగ్గును గత 134 సంవత్సరాలుగా సరఫరా చేస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థ కూడా తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింతగా పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. సంస్థ మనుగడ,పురోభివృద్ధి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకతలతో పాటు ఉత్పత్తి అయిన వస్తు నాణ్యత పై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.విద్యుత్ రంగంలో సంభవించిన మార్పుల ఫలితంగా యావత్ భారతదేశం ఒకే పంపిణీ వ్యవస్థ కిందకు రావడం జరిగిందని,తక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.విద్యుత్ సంస్థల పురోగతి  నాణ్యమైన బొగ్గు పైన ఆధారపడి ఉందని, వినియోగదారుడి మనుగడ పైనే బొగ్గు సంస్థల అభివృద్ధి ఆధారపడి ఉందని దీనిని  గుర్తుంచుకోవాలని కోరారు. 

నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు తన వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం మన కర్తవ్యం గా భావించాలని సూచించారు. నాణ్యమైన బొగ్గు సరఫరా ద్వారా తక్కువ ధరకే విద్యుత్ ఉత్పాదకత సాధ్యం అవుతుందని తద్వారా వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గి లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరి సలేంద్ర సత్యనారాయణ, క్వాలిటీ ఇంచార్జ్ ఆఫీసర్ వెంకటరెడ్డి,ఏఐటీయుసీ జి.ఎం కార్యాలయ పిట్ సెక్రటరీ సాంబశివరెడ్డి,డివైపిఎం ఎండి ఆసిఫ్, అన్ని డిపార్ట్ మెంట్ల