calender_icon.png 16 January, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా సెమీస్‌కు

12-09-2024 12:55:04 AM

  1. రాజ్‌పాల్ హ్యాట్రిక్ గోల్స్
  2. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ

హులున్‌బిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 తేడాతో మలేషియాపై ఘన విజయం సాధించి దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. యువ స్ట్రుకర్ రాజ్ కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిన వేళ.. సహచర ఆటగాళ్లు కూడా గోల్స్‌తో విజృంభించడంతో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. భారత్ తరఫున రాజ్ కుమార్ (3వ, 25వ, 33వ నిమిషంలో), అరయ్‌జీత్ సింగ్ (6వ, 39వ ని.లో), జుగ్‌రాజ్ సింగ్ (7వ ని.లో), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (22వ ని.లో), ఉత్తమ్ సింగ్ (40వ ని.లో) గోల్స్ నమోదు చేశారు.

మలేషియా తరఫున అఖీముల్లా (34వ ని.లో) జట్టుకు ఏకైక గోల్ అందించాడు. మలేషియాతో జరిగిన మ్యాచులో భారత ఆటగాళ్లు గోల్ పోస్ట్ మీద దాడుల పరంపర కొనసాగించారు. దీంతో మలేషియా ఆటగాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో విజయం కాగా.. ఈ గెలుపుతో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. కాగా భారత్ నేడు కొరియాతో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 14న భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ 9 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. సెప్టెంబర్ 16న సెమీఫైనల్స్, 17వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగ నుంది. జరుగుతాయి.

ఆ ఉత్తరం నాకు ప్రత్యేకం

అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు ప్రకటించిన భారత దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ప్రధాని మోదీ తనకు రాసిన లేఖను బుధవారం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు.  ‘నా రిటైర్మెంట్ రోజున ప్రధాని మోదీ ప్రత్యేక ఉత్తరం పంపారు. ఆ ఉత్తరం నాకు ప్రత్యేకం. వీడ్కోలు పలికినా నా సేవలు ఎల్లప్పు డు ఉంటాయి’ అని శ్రీజేశ్ పేర్కొన్నా డు. ‘మీ జీవితంలో ఎన్నో మరుపురా ని సన్నివేశాలు, జ్ఞాపకాలు ఉంటాయి. అన్నింటిని గుర్తు చేస్తే ఈ లేఖ సరిపోదు. ఎన్నో అవార్డులు మీరు పొంది ఉంటారు. గ్రౌండ్ బయటా లోపల కూడా మీ వ్యక్తిత్వం గొప్పగా ఉం టుంది’ అని మోదీ శ్రీజేష్‌ను అభినందిస్తూ లేఖ రాశారు.