calender_icon.png 1 April, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోలకు క్యూఆర్ కోడ్

27-03-2025 01:26:49 AM

జగిత్యాల, మార్చి26 (విజయక్రాంతి): మహిళలలు, వృద్ధులు,, ప్రయాణికులు  సురక్షిత ప్రయాణం, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మై ఆటో ఈస్ సేఫ్  అనే కార్యక్రమం ను మెట్ పల్లి  పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్  ప్రారంబించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....  మహిళలు, వృద్ధులు, ప్రయాణికుల సురక్షిత, భద్రత కొరకు మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 4000 లకు పైగా ఆటోలు ఉన్నాయని ఇప్పటి వరకు 2500 లకు పైగా ఆటోలకు క్యూ ఆర్ కోడ్  తో  అనుసంధానం చేయడం జరిగిందన్నారు.రాబోవు రోజుల్లో మిగతా ఆటోలో కూడా ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందని అన్నారు.

ఈ రోజు మెట్ పల్లి  పట్టణంలో సుమారు 346   ఆటో లకు (ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా) స్టిక్కరింగ్ చేయడం జరిగిందని   ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలని సూచించారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదేనా సమస్య ఎదురైతే ఆటో డ్రైవర్ సీట్ వెనకాల గల క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే అట్టి ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ నందు కనిపిస్తుంది వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్,ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు.

ఎమర్జెన్సీ కాల్ లేదా టెకస్ట్ రూపంలో స్పందించినప్పుడు పోలీస్ వారు అ యొక్క  సమాచారం ఆదారంగా  వెంటనే స్పందించి సంఘటన  స్థలానికి చేరుకోవడం జరుగుతుందన్నారు.  జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖలతో  సమన్వయంగా  పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా  సురక్షిత ప్రయాణం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి  తరచూ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను సందర్శిస్తూ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.