నల్ల విజయ్‌కుమార్ :
సిరిసిల్ల పేరు చేనేత పరిశ్రమలో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఈ కళాకారుల కృషి, సృజనాత్మకతతో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించింది. దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చిన్న పట్టణం చేనేత రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు చేనేతతో మమేకమై ఉంటారు. చేనేత కళాకారులు చీరలలో సృజనాత్మకత, నైపుణ్యంతో కొత్త పుంతలు తొక్కుతున్నారు.
ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ అనే కళాకారుడు, తన ప్రతిభను ప్రదర్శిస్తూ 20 లక్షల రూపాయల విలువ చేసే చీరను నేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ చీరకు వచ్చిన ఆర్డర్ ఆయన ప్రతిభకు, అరుదైన ఉన్నత నైపుణ్యానికి నిదర్శనం. ఆయనకు చీర నేయడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది.
ఈ చీరను సున్నితమైన పట్టు, బంగారు జరీతో, అందమైన కళాత్మక డిజైన్లతో తయారుచేశారు. చీరలోని ప్రతి నూలు అద్భుతంగా, ఒక పద్ధతిగా అమర్చారు. విజయ్‌కుమార్ కష్టసాధ్యమైన ఈ పనిని పూర్తి చేయడానికి రోజూ కనీసం 10- గంటలు కష్టపడ్డట్టు తెలుస్తున్నది.
సిరిసిల్ల చేనేత కళలో ప్రత్యేకతలు చాలా వున్నాయి. వీరి నైపుణ్యమే ఒక ప్రత్యేకతగా ప్రపంచానికి చాటి చెప్తోంది. ఇక్కడి నేతలు ఆధునికతకు అనుగుణంగా తమ పద్ధతులను మార్చుకుంటూ, ప్రతిసారి కొత్త డిజైన్లతో వినూత్నత చూపిస్తూ ఉంటారు. సున్నితమైన పట్టువస్త్రాలను ఉపయోగించి కొత్త తరహా డిజైన్లు అద్భుతంగా రూపొందించడంలో వారు నిపుణులు.
అందులోనూ దేశీయంగానేకాక అంతర్జాతీయ మార్కెట్లకూ వారు తమ సృజనాత్మకతను అందిస్తున్నారు. నల్ల విజయ్‌కుమార్ తనకు వచ్చిన పెద్ద ఆర్డర్‌ను అద్భుతంగా పూర్తి చేశారు. ఆయన తన శక్తినంతా ఈ ప్రత్యేక చీర తయారీకి ధారపోశారు.
ప్రతి భాగం కూడా జాగ్రత్తగా, సున్నితమైన డిజైన్లతో, అత్యుత్తమ నూలుతో అల్లడం ద్వారా వస్త్రం ఎంతో విలువైందిగా రూపొందింది. విజయ్ కుమార్ తనకు వచ్చిన ఈ ఆర్డర్‌తో ప్రపంచ చేనేత రంగంలో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చీరను ఒక ప్రముఖ సంస్థ ప్రత్యేక సందర్భం కోసం ఆర్డర్ చేసింది.
- డా. చిట్యాల రవీందర్, హైదరాబాద్