calender_icon.png 7 March, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ ఎమర్జెన్సీ.. శంషాబాద్ లో విమానం అత్యవసర ల్యాండింగ్

05-03-2025 02:10:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దోహ నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్న ఖత్తర్ విమానం(Qatar Airways) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ చేశారు. విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలకి గుండెపోటు రావడంతో మెడికల్ ఎమర్జెన్సీ(Medical Emergency) కోసం విమానం అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు పైలట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన మహిళా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.