ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్
ముంబై, నవంబర్ 6: ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు మరింతగా 6.5 శాతానికి తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకానమిస్టులు అంచనా వేశారు. 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతానికి సమీపంలో నమో దు కావచ్చని తాజాగా విడుదల చేసిన నోట్‌లో ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు.
ఈ ఏడాది క్యూ1లో (ఏప్రిల్-జూన్)లో దేశ వృద్ధి రేటు 15 త్రైమాసికాల కనిష్ఠస్థాయి 6.7 శాతానికి తగ్గింది. దేశంలో వినియోగం తగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయని, క్యూ2లో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయని ఎకానమిస్టులు వివరించారు. ఈ మందగ మనం తాత్కాలికమేనని, డిసెంబర్ త్రైమాసికం నుంచి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.