calender_icon.png 16 January, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండచిలువ కలకలం

16-09-2024 01:00:02 AM

నిర్మల్, సెప్టెంబర్15, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గావ్ గ్రామంలో ఆదివారం భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతులు లక్ష్మణ్, పోతన్న పొలం నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డుపై భారీ కొండ చిలువ కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. కొందరు యువకులు పాములు పట్టే సహాజన్‌కు సమాచారం ఇవ్వగా అతడు అక్కడికి వచ్చి 20 అడుగుల పొడవున్న కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.