calender_icon.png 8 February, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో రోజుకు చేరిన నిరసనలు

08-02-2025 03:11:43 PM

పటాన్ చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ ప్యారానగర్ లో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డ్  కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్తులు, మండల ప్రజలు చేపట్టిన నిరసనలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామంలో సీపీఎం నాయకులు డంప్ యార్డ్  ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజలకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తక్షణమే డంప్ యార్డ్ పనులు నిలిపేయాలని, డంప్ యార్డ్ ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలాన్ని మరో జోహార్ నగర్ గా మారుస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  డంప్ యార్డును రద్దు చేసే వరకు ప్రజల పక్షాన ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. మరోవైపు నల్లవల్లి గ్రామ చౌరస్తా, గుమ్మడిదల, బొంతపల్లి కమాన్ వద్ద పోలీస్ క్యాంపులు  కొనసాగుతున్నాయి. పోలీస్ పహార మధ్య ప్యారానగర్ లో డంప్ యార్డ్ పనులు జరుగుతూనే ఉన్నాయి.