calender_icon.png 8 January, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరిలో పీవీ సింధు

08-01-2025 12:09:49 AM

పెళ్లి తర్వాత భారత స్టార్‌కు తొలి టోర్నీ

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు పెళ్లి తర్వాత ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో బరిలోకి దిగుతోంది. జనవరి 14 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో సింధూతోపాటు భారత స్టార్ షట్లర్లు కూడా అందుబాటులో ఉండనున్నారు. మొత్తం 21 మంది భారత ప్లేయర్లు బరిలో ఉండగా.. వారిలో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, మాళవిక బన్సోద్, సాత్విక్ జోడీ ఉన్నారు.

ప్రపంచ నంబర్‌వన్ షి యూకీతో పాటు ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అలెక్సన్, యాన్ సె యంగ్ కూడా పోటీలో ఉన్నారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో ముగ్గురు, మహిళల సింగిల్స్‌లో నలుగురు, పురుషుల డబుల్స్‌లో రెండు జోడీలు, మహిళల డబుల్స్‌లో ఎనిమిది జోడీలు, మిక్స్‌డ్ డబుల్స్‌లో నాలుగు జోడీలు ఉన్నాయి. సింగిల్స్‌లో సింధూ, లక్ష్యసేన్‌పై భారీ ఆశలు ఉండగా.. డబుల్స్‌లో సాత్విక్ జంట టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాళ్లకు 9లక్షల 50వేల అమెరికన్ డాలర్లతో పాటు 11వేల ర్యాంకింగ్ పాయింట్స్ దక్కించుకోనున్నారు. గతేడాది డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో సింధూ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.