calender_icon.png 25 December, 2024 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో పీవీ సింధు

18-10-2024 12:00:00 AM

డెన్మార్క్ ఓపెన్

ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధూ 18-21, 21-12, 21-16తో  ప్రపంచ ఏడో ర్యాంకర్ హన్ యూ (చైనా)పై చెమటోడ్చి నెగ్గింది. 63 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధూ తొలి గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయింది.

అయితే రెండో గేమ్‌లో ఫుంజుకున్న సింధు బలమైన సర్వీస్, ర్యాలీ షాట్లతో అదరగొట్టింది. ఫలితంగా రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇరువురు ఒక్కో పాయింట్ కోసం శ్రమించారు. అయితే చివర్లో బలమైన స్మాష్‌లు కొట్టిన సింధూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

తద్వారా మే నెలలో మలేషియా మాస్టర్స్ ఫైనల్ అనంతరం సింధూ ఒక టోర్నీలో టాప్ క్రీడాకారిణిని చిత్తు చేయడం విశేషం. అంతేకాదు హాన్ యూపై ఉన్న రికార్డును (7-1)తో మరింత మెరుగుపరుచుకుంది. అయితే క్వార్టర్స్‌లో సింధూ డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిక్‌ఫెల్డ్ లేదా మారిస్కా టున్‌జంగ్ (జార్జియా)ను ఎదుర్కొనే అవకాశముంది.