calender_icon.png 27 December, 2024 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవీ నరసింహారావు పురస్కారం కాళోజీకి ప్రదానం

26-12-2024 07:42:47 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక  పురస్కారాన్ని ప్రముఖ ప్రజా కవి దివంగత కాళోజి నారాయణరావుకు పీవీ మెమోరియల్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీవీ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు  పద్మశ్రీ, కవి డా. టి. హనుమాన్ చౌదరి, పి. విజయ్ బాబు, బాలాలత,   మాదంశెట్టి అనిల్ కుమార్ లు మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ ప్రజా కవి కాళోజి నారాయణరావు తరుపున వివిధ భాషల అనువాదకుడు నల్ల మోతుల భాస్కర్ రావుకు ఈనెల 28న రవీంద్రభారతిలో అందజేయనున్నట్లు  పేర్కొన్నారు. 

ఈ ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, సురభి దేవి, అమీర్ అలీఖాన్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ. ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ. కేవీ రామచంద్రరావు, సాంస్కృతిక శాఖ సారథి వెన్నెల గద్దర్ లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీకర్ శర్మ, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.