మంత్రి పొన్నం ప్రభాకర్
హనుమకొండ, జూన్28 (విజయక్రాంతి)/ హుస్నాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం పీవీ జయంతిని పురసష్కరించుకుని ఆయన స్వగ్రామం భీమదేవరపల్లి మండ లం వంగరలోని పీవీ ఇంట్లో, హుస్నాబాద్‌లో వేర్వేరుగా నిర్వహించిన వేడుకల్లో మం త్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతం నాయకుడు దేశానికి ప్రధాని కావడం గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. హుస్నా బాద్ ప్రాంత రాజకీయ నాయకులు పీవీ జీవిత చరిత్రను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయ కులు కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, ఊసకోయిల ప్రకాశ్, చంద్రశేఖర్ గుప్తా, చిదురాల స్వరూప పాల్గొన్నారు.