- 28న రవీంద్ర భారతిలో ప్రదానోత్సవం
- హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, స్పీకర్ ప్రసాద్‌కుమార్, ప్రముఖులు
- పీవీ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధుల వెల్లడి
ముషీరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ ప్రజాకవి దివంగత కాళోజీ నారాయణరావుకు పీవీ మొమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ప్రకటించినట్టు ఆ ట్రస్ట్ ప్రతినిధులు కవి, పద్మశ్రీ డాక్టర్ హనుమాన్ చౌద రి, విజయ్‌బాబు, బాలలత, మాదం శెట్టి అనిల్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్ల బ్‌లో వారు మీడియాతో మాట్లాడు తూ..
పీవీ స్మారక పురస్కారాన్ని ప్ర ముఖ ప్రజాకవి కాళోజీ నారాయ ణరావు తరఫున వివిధ భాషల అను వాదకుడు నల్ల భాస్కర్‌రావుకు 28న రవీంద్రభారతిలో అందజేయనున్న ట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జి ష్ణుదేవ్ వర్మ, స్పీకర్ గడ్డం ప్రసా ద్‌కుమార్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, వాణి దేవి, కృష్ణయ్య, అమీర్ అలీఖాన్, ఎ మ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సాం స్కృతిక శాఖ సారధి వెన్నెల గద్దర్ హాజరుకానున్నారని తెలిపారు. సమా వేశంలో న్యాయవాది శ్రీకర్ శర్మ, సూ ర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.