calender_icon.png 25 October, 2024 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైటెక్స్‌లో పుట్టపాక ‘ఇక్కత్’

22-07-2024 01:53:03 AM

ఫిక్కీ ఆధ్వర్యంలో పుట్టపాక ఉమెన్స్ హ్యాండ్లూమ్స్ ఇక్కత్ ఎగ్జిబిషన్

ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ

ఎల్బీనగర్, జూలై 21 : ఫిక్కీ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఆదివారం నిర్వ హించిన ఎగ్జిబిషన్‌లో పుట్టపాక చేనే త వస్త్రాలు ప్రత్యేక అకర్షణగా నిలిచా యి. పుట్టపాక చేనేత వస్త్రాల స్టాల్‌ను ప్రముఖ సినీ నటి, టీవీ యాంకర్ సుమ ప్రారంభించారు. గ్రామీణ మహిళల చేతితో తయారు చేసిన చేనేత వస్త్రాలను ఇక్కడ ప్రదర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండ లం పుట్టపాక గ్రామం చేనేత వస్త్రాల తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ సహజ రంగులతో మగ్గం నేసిన చేనేత వస్త్రాలకు దేశవిదేశాల్లో మంచి పేరుంది.

పుట్టపాక చేనేత హస్తకళాకారులు పద్మశ్రీ, రాష్ట్రపతి, జాతీయ అవార్డు లు సైతం గెలుచుకున్నారు. పుట్టపాకకు తలమానికమైన తేలియా డబు ల్ ఇక్కత్ దుప్పట వస్త్రాలను హైటెక్స్‌లో ప్రదర్శించారు. పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పుట్టపాక చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. స్టాల్స్‌ను నిర్వహిస్తున్న పుట్టపాక ఉమెన్స్ హ్యాండ్లూమ్స్ ఇక్కత్ ప్రొడక్ట్స్ అధ్యక్షురాలు సామల విజయలక్ష్మీభాస్కర్, కార్యదర్శి గజం పుష్పలతా వెంకటేశ్, కోశాధికారి పానుగంటి పద్మావెంకట్రావ్, చేనేత మహిళలను ప్రోత్సహిస్తున్న మాజీ సర్పంచ్ భాస్కర్‌లను మహిళా పారిశ్రామికవేత్తలు, టీవీ యాంకర్ సుమ తదితరులు అభినందించారు.