చల్లా నారాయణ రెడ్డి అసత్య ప్రచారం రాజకీయ లబ్ధి కోసమే
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య
పెద్దపల్లి (విజయక్రాంతి): మంథనిలో హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ పుట్ట మధుకర్ అని, చల్లా నారాయణ రెడ్డి దుద్ధిళ్ల సోదురులపై చేసిన అసత్య ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య విలేకరుల సమావేశంలో అన్నారు. శ్రీధర్ బాబు మోచేతి నీళ్లు తాగి 100 ఎకరాల్లో భూములు, కోట్ల రూపాయలు సంపాదించిన చల్లా, ఇలా అసత్య ప్రచారాలు చేయడం ఎవరి లబ్ధి కోసం అన్నారు. మంథని నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగచేయడానికి పుట్ట మధు ఆదేశాలతో మీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలే బుద్ధి చెప్తారని, శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు శ్రీనుబాబులపై మీ హత్య రాజకీయాలను ప్రజలు నమ్మరన్నారు. చల్లా, పుట్ట మీ జీవిత చరిత్ర మంథని ప్రజలందరికి తెలుసునని, ఒక్కసారి ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇస్తే నీ హత్య రాజకీయాలను ప్రజలకు చూపించారని, నడి రోడ్డు మీద వామనరావు దంపతులను హత్య చేపించారని, దళితున్ని హత్య చేయించారని, హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మంథని చేశారని సమ్మయ్య వారిపై మండిపడ్డారు.
కానీ మా మంత్రి శ్రీధర్ బాబు ఆ మచ్చను తుడిపేసి మంథని తోపాటు పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కృషి చేస్తున్నారని కోనియాడారు. మంత్రి మీద వారి సోదరుడు శ్రీను బాబు మీద అసత్య ఆరోపణలు చేసిన చల్ల పై బసంత్ నగర్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల అధికార ప్రతినిధి తలారి శంకర్, ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్ కుమార్,అర్కల సతీష్, మాజీ ఉప సర్పంచ్ బాలగొని కుమార్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ బడవత్ శంకర్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ షకీల్ లాల్, ఎగోలాపు రమేష్ గౌడ్, సంపంగి కుమార్, తువ్వా సతీష్ యాదవ్, చిలగని రాజేష్, బడుగు మహేందర్, అంజి నాయక్, మహ్మద్ రఫీ, మహ్మద్ సఫీ, దాసరి సాగర్, వెగ్గిల్లపు అశోక్, సంపంగి లక్ష్మయ్య, గోలుకొండ శంకర్, ఇస్లావత్ రాజేష్, బాధవత్ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.