27-02-2025 03:49:05 PM
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం, (విజయక్రాంతి): భక్తి మార్గంతోనే మంచి పద్దతి, ప్రశాంతత సాధ్యమవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్(Manthani Former MLA Putta Madhukar) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం మల్లయ్యపల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్బంగా ఆయన సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గతంలో అనేక మంది దాతల సహకారంతో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ది చేసిందని, నీళ్లు సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు.ఇంకా ఆలయ అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో ఆధ్యాత్మికత...ఆహ్లదం పంచేలా ఉంటుందని, ఈ క్రమంలో మరింత అభివృధ్ది చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేయాలని ఆయన కోరారు. భక్తులకు సేద తీరేలా షెడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు.