మంథనిలో ఉనికిని చాటుకోడానికే పుట్ట మధు ప్రయత్నం
మా నాయకుడిని విమర్శించే ముందు నీ గత చరిత్ర తెలుసుకో
మంథనిలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, చైర్ పర్సన్ రమాదేవి
మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ ప్రజల్లో ఉనికిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన ఉనికిని చాటుకోడానికే కాంగ్రెస్ పార్టీని, మంత్రి శ్రీధర్ బాబును విమర్శిస్తున్నాడని మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుట్ట మధు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రిపై అసత్య ఆరోపణలు చేశారని వాటిని ఖండిస్తున్నామన్నారు.
ముత్తారం కస్తూర్బా విద్యార్థినిలకు స్వల్ప అస్థవతకు గురైతే వెంటనే స్పందించిన మంత్రి వారికి జిల్లా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించి, మరో ముగ్గురు కొద్దిగా ఇబ్బందులు ఉంటే హైదరాబాద్ కు తరలించి నాణ్యమైన వైద్యం అందిస్తున్నాడని, పిల్లలందరూ బాగానే ఉన్నారని అయినప్పటికీ అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందెందుకే పుట్ట మధు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని అప్పుడు నీవు ఎందుకు స్పందించలేదన్నారు.
మంథనిలో ఇటీవల జరిగిన శైలజ మృతి అందరినీ తీవ్రంగా కలచి వేసిందని, తాము కూడా ఎంతో బాధపడ్డామని, ఇలాంటి అకస్మాత్తు ఘటనలు జరగడం దురదృష్టకరమని, ప్రమాదాలు ఎవరికి ఎప్పుడు జరుగుతాయో తెలవని, ఇటువంటి ఘటనలు రాజకీయం చేయవద్దని, శివాలపై రాజకీయాలు చేయడం నీకే చెల్లిందన్నారు. బీసీ బిడ్డలను మంత్రి అణగదొక్కుతున్నారని మధు ఆరోపించడం ఆయన అవివేకం అన్నారు. నీ దగ్గర ఉన్న బీసీ బిడ్డలు ఎందుకు మంత్రి దగ్గరికి వస్తున్నారని, తాను నీ బంధువునని అయినప్పటికీ నన్ను అణిచివేశావని, నన్ను చేరదీసిన మంత్రి మండల అధ్యక్షున్ని చేసి నాయకుడిగా తీర్చిదిద్దుతున్నాడని ప్రసాద్ తెలిపారు.
నా అంత చదువుకొని నీవు మా మంత్రిని విమర్శిస్తావా... మమ్ముల దాటిన తర్వాతే నీవు మంత్రి పేరు ఎత్తాలని అన్నారు. నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు ఇటీవల రూ. 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రిని పుట్ట మధు విమర్శిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు మరొకసారి బుద్ధి చెప్తారని చైర్ పర్సన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్, కుడుదుల వెంకన్న, అజీంఖాన్, మంతెన సత్యం, పెరవేని లింగయ్య, బూడిది శంకర్, ఎరుకాల ప్రవీణ్, ఐలి శ్రీనివాస్, నక్క నాగేంద్ర, అక్కపాక. సదయ్య, గొల్లపల్లి శ్రీనివాస్, దొరగొల్ల శ్రీనివాస్, అరెల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.