28-03-2025 12:26:26 AM
భారత్ ఆహ్వానాన్ని అంగీకరించిన రష్యా అధ్యక్షుడు
న్యూఢిల్లీ, మార్చి 27: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భార త్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని గురువారం రష్యా ధ్రువీకరిం చింది. గతేడాది మాస్కో పర్యటన సం దర్భంగా భారత్‌లో పర్యటించాలం టూ పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినట్టు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల్లో మూడోసారి తిరిగి ఎన్నికైన తర్వాత తొలి విదేశీ పర్యటనకు రష్యా ను ఎంచుకున్నట్టు సెర్గీ గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు తమ వంతు వచ్చిందని వెల్లడించారు. పుతిన్ భారత పర్యటన కోసం సన్నాహాలు జరుగుతున్నాయ ని, అయితే పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని సెర్గీ స్పష్టం చేశారు.
పుతిన్ త్వరలో చనిపోతారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతారని, దీంతో రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో బుధవారం జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ ఉద్దే శించి జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘త్వరలో అతడు చినిపోతాడు. అది నిజం. దీం తో యుద్ధం ముగుస్తుంది.’ అని అన్నా రు. అంతేకాకుండా శాంతి ప్రయత్నా లు జరుగుతున్నప్పటికీ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోందని ఆ రోపించారు. ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాల నేపథ్యం లో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.