మాస్కో, జనవరి 24: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నా రని.. ఈ విషయంలో అమెరికా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ భేటీ ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్రెమ్లిన్ ఎటువంటి స్పష్టత నూ ఇవ్వలేదు.
దావోస్‌లో జరుగుతున్న ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పుతిన్‌తో వర్చు వల్‌గా ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగిస్తానని ట్రం ప్ చెప్పినా కానీ ఈ విషయంపై రష్యా అమెరికాతో ఏకీభవించలేదు. ఇటీవలి కాలంలో అమెరికా-రష్యా సంబంధాలు క్షీణించాయి.