calender_icon.png 19 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల విరమణకు అంగీకరించిన పుతిన్

19-03-2025 01:53:06 AM

  1. ఫోన్లో రెండు గంటలకు పైగా  చర్చలు జరిపిన ట్రంప్-పుతిన్
  2. కాల్పుల విరమణ గురించే మంతనాలు

న్యూఢిల్లీ, మార్చి 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ కాల్‌లో 2 గంటలకు పాటు మంతనాలు జరిపారు. 30 రోజుల పాటు ఉక్రెయిన్ మీద దాడులు నిలిపివేయనున్నట్లు, ప్రధానంగా ఉక్రెయిన్ శక్తి వనరుల మీద కాల్పులు ఆపేందుకు ఈ సందర్భంగా పుతిన్ అంగీకరించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

‘ఎనర్జీ ఇన్‌ప్రాస్ట్రక్చర్ సీజ్ ఫైర్’ కు ట్రంప్, పుతిన్ మద్దతు తెలిపారు. ‘ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ఇరుదేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆర్థికంగా కూడా ఎంతో ఖర్చయింది. ఈ రెండు దేశాల మధ్య భవిష్యత్‌లో మరలా సమస్య రాకుండా ఉండేందుకు అమెరికా కృషి చేస్తోంది’ అని ఆ ప్రకటనలో వివరించారు.