calender_icon.png 16 November, 2024 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫీసు బ్రేక్ టైంలో కాపురం చేయండి: పుతిన్

18-09-2024 02:04:41 PM

మాస్కో: రోజంతా ఆఫీసులోనే గడిపేసే  ఉద్యోగులు తమ కాఫీ, లంచ్ బ్రేక్ సమయాలలో మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండాలని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమీర్ పుతిన్ సూచిస్తున్నారు. దేశంలో పడిపోతున్న జననాల రేటు క్షీణతను తగ్గించేందుకు శ్రమించాలన్నారు. అధికార లెక్కల ప్రకారం ప్రస్తుతం రష్యాలో సంతానోత్పత్తి రేటు ప్రకారం ప్రతీ మహిళకు 1.5 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.అయితే, జనాభా స్థిరత్వం కోసం ఈ రేటు 2.1 ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

రోజులో 12 నుంచి 14 గంటలు ఆఫీసులోనే గడుపుతున్న వారు పిల్లలను కనడం ఎలా సాధ్యమన్న  ప్రశ్నకు ఆయన ఈ పరిష్కారాన్ని సూచించారు. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలయ్యాక రష్యా యువత పెద్ద సంఖ్యలో దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది రష్యన్ యువత దేశం దాటినట్లు సమాచారం. అటు యుద్ధంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఇక ఈ ఏడాది 49వేల మరణాలు సంభవించాయి. ఇటు యువత ఎక్కువ సమయం ఆఫీసు పనుల్లోనే నిమగ్నమవ్వాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆఫీసు బ్రేక్ టైమ్ ను భాగస్వామితో శృంగారానికి కేటాయించాలని పుతిన్ సూచించారు.

ఈ నేపథ్యంలో అబార్షన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. మహిళా సంతాన సాఫల్య పథకాలు, అద్దెగర్భం తదితరాలను ఉచితంగా చేయించే ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తున్నారని రష్యా సంతాన సాఫల్య శాఖ అధికారులు పేర్కొన్నారు.రష్యా అధికారక గణాంకాల ఏజెన్సీ రోస్ స్టాట్ నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్థభాగంలో 16 వేల తక్కువ జననాలు నమోదయ్యాయి.