calender_icon.png 27 October, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట కలిపి.. బంగారం చోరీ

27-10-2024 12:13:52 AM

  1. కరెంటోళ్లమని చెప్పి.. కత్తితో బెదిరించి..
  2. వృద్ధురాలి మెడలోంచి నగలు అపహరించిన దుండగులు 

కల్వకుర్తి , అక్టోబర్ 26: కరెంటోళ్లమని చెప్పి ఇద్దరు దొంగలు వృద్ధురాలితో మాట కలిపారు.. తీరా కత్తితో బెదిరించి దాడి చేసి ఆమె మెడలో ఉన్న ౩ తులాల బంగారం చోరీచేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో శనివారం కలకలం రేపింది. స్థానిక సుభాష్‌నగర్‌లో నివాసం ఉంటున్న తిరుపతమ్మ (65) పళ్ల్ల రసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది.

శనివారం ఇద్దరు కరెంట్ అధికారులమంటూ ఆమెతో మాట కలిపారు. కొద్దిసేపటికి  తిరుపతమ్మను కత్తితో బెదిరించి మెడలో ఉన్న ౩ తులాల బంగారు తాడును లాక్కెళ్లారు. దాడికి ముందు రెక్కీ నిర్వహించి ఎవరు లేని క్రమంలోనే ఈ దోపిడీకి పాల్పడ్డారు. బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వ డంతో.. సీఐ నాగార్జున, ఎస్సై మాధవరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిం దితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశా రు. అనుమానితులు ఎవరైనా చుట్టుపక్కల కనిపిస్తే సమాచారమివ్వాలని, అపరిచిత వ్యక్తులతో మాట్లాడడం, పరిచయాలు చేసుకో వడం వల్ల ఇలాంటి ఘటనలకు దారి తీస్తుందని సీఐ హెచ్చరించారు. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.