calender_icon.png 16 January, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ తీర్పు చెంపపెట్టు

18-07-2024 01:15:16 AM

కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూశారు 

కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో సరైన గుణపాఠం చెబుతాం

ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించిన కేటీఆర్

హైదరాబాద్, జూలై 17 ( విజయక్రాంతి): విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్‌ని బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం తప్పు పట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని కోరుకునే వ్యక్తిని నేను అని తెలిపారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు.

నిజానికి వాటికి కూడా ఓ పరిమితి ఉంటుందని కానీ ఆ పరిమితులను దాటి కాంగ్రెస్ కేసీఆర్ మీద దుష్ర్పచారాలకు పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే  ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేసిందన్నారు. కేసీఆర్  మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని లేదంటే ప్రజా క్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రావటం ఖాయమన్నారు.