ఆర్జీకర్ కేసు దోషి తల్లి
కోల్‌కతా, జనవరి 19: ఆర్జీకర్ హాస్పిటల్‌లో లేడీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అతడి తల్లి స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చి తంగా తగిన శిక్ష విధించాలని పేర్కొన్నారు.
తన కొడుకు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్తారా అని మీడి యా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోద రి మాట్లాడుతూ.. ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరికీ శిక్ష పడాలన్నారు.