calender_icon.png 30 October, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాలకు స్వస్తి.. ఇకపై సినిమాలే చేస్తా

29-06-2024 12:05:00 AM

ప్రముఖ నటుడు అలీ రాజకీయాలకు స్వస్తి పలికారు. ఇకపై శాశ్వతంగా రాజకీయాల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన శుక్రవారం రాత్రి ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో అలీ మాట్లాడుతూ.. ‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన తర్వాత డాక్టర్ డి.రామానాయుడు గారి ప్రోత్సాహంతో నేను ‘ప్రేమఖైదీ’ సినిమాతో మళ్లీ నా కెరీర్ ప్రారంభమైంది. మా నాన్న పేరుతో ట్రస్ట్ ప్రారంభించాను. అలా సామాజిక సేవ చేస్తున్నాను.

నా సంపాదనలో 20 శాతం ట్రస్ట్ కోసమే ఖర్చు చేస్తున్నాను. చాలా ఏళ్లుగా రాజకీయాల్లోనూ కొనసాగుతు న్నాను. సుమారు ౨౦ ఏళ్లకు పైగా రాజకీయ పార్టీలతో కలిసి పని చేశాను. అయితే, ఏనాడూ ఏ పార్టీకీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను కొనసాగిన పార్టీలోని నాయకుల గురించి మంచి విషయాలపైనే మాట్లాడాను తప్ప, ఏ ఇతర పార్టీల నాయకుల మీద కూడా వ్యక్తిగ తంగా విమర్శలు చేయలేదు. అయితే ఇప్పుడు నేనొక నిర్ణయం తీసుకున్నాను.

కపై సామాన్య పౌరుడిగానే మసులుకుంటాను. అందరు ఓటర్లలాగే నేనూ ఓటు వేయడానికి మాత్రమే ఎన్నికల్లో పాల్గొంటాను. రాజకీయాలకు స్వస్తి. ఇకపై నా పూర్తి స్థాయి జీవితాన్ని సినిమాలకే కేటాయిస్తాను. ఇది చెప్పడానికే మీ ముందుకు వచ్చాను’ అని ముగించారు. అలీ ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీలో కొనసాగిన విషయం తెలిసిందే.