అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ అప్‌డేట్ రానే వచ్చింది. అదేంటంటే.. ‘పుష్ప ది రూల్ ’ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు దీని కోసమే ఎదురు చూస్తున్నారు. మరో 50 రోజుల్లో అంటే డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను వదిలారు. అల్లు అర్జున్ మాసివ్ లుక్‌తో పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. సింహాసనాన్ని అధిరోహించిన పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. పుష్ప చిత్రం మంచి విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆ అంచనాలు తగ్గకుండా సీక్వెల్ ఉండేందుకు చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్‌కూ మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణాంతర పనులను సైతం మేకర్స్ చకచకా పూర్తి చేస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.