- అల్లు అర్జున్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
- సీఎం రేవంత్ ఆవేదనలో అర్థముందంటూ పోస్టులు
- ప్రెస్‌మీట్ తర్వాత బన్నీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
- మీడియా సమావేశం ఎందుకు పెట్టారంటూ ప్రశ్నలు
- పుష్పరాజ్ మాటల్లో పశ్చాత్తాపం కనపడేలేదంటూ సెటైర్స్
- బన్నీ చెప్పినవి అబద్ధాలు అంటూ ఆధారాలతో ట్రోలింగ్
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న #alluarjunarrested హ్యాష్ ట్యాగ్
హైదరాబాద్, డిసెంబర్ 2౨ (విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్‌పై నెటి జన్లు ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట విషయంలో బన్నీ వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అసెంబ్లీలో తొక్కిసలాట ఉదంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించిన తర్వాత.. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి అవన్నీ అబద్ధాలు అని, తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని, పోలీసుల డైరెక్షన్‌లోనే తాను థియేటర్‌కు వెళ్లానని, ఆ తర్వాత కొద్దిసేపటికే బయటకు వచ్చేశానని చెప్పారు.
ఈ సందర్భం గా బన్నీ చేసిన వ్యాఖ్యలతోపాటు ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ కాదు ఏకంగా వైల్డ్ ఫైర్‌ను అంటించారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి మద్దతుగా బన్నీపై రకారకాల పోస్టులతో విరుచుకుపడ్డారు. పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘తగ్గేదేలే’ను ట్రోల్ చేస్తున్నారు.
‘అప్పడప్పుడు తగ్గాల్సిందే పుష్ప’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో #alluarjunarrested అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుతోంది. ఇదే సమయంలో ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదనపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రెస్‌మీట్‌లో అర్జున్ చెప్పిన దానికి, థియేటర్‌లో జరిగిన దానికి విరుద్ధంగా ఉన్నాయాంటూ వీడియోలను గుప్పించారు.
అసలు అర్జున్ ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. ఆ ప్రెస్‌మీట్ సంజాయిషీ ఇచ్చుకునేలా లేదని, ప్రభుత్వాన్ని, పోలీసులను బద్నాం చేసేవిధంగా ఉందంటూ పోస్టులతో విరుచుకు పడుతున్నారు.
ఆధారాలతో ఆరేశారు
‘థియేటర్ బయట మహిళ చనిపోయి న విషయం నాకు ఆ రోజు తెలియదని, తెల్లారి తెలిసింది ’ అంటూ బన్నీ చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం ఆ రోజు రాత్రే తాము అల్లు అర్జున్‌కు చెప్పామని పేర్కొన్నారు. సినిమా చూసిన తర్వాతే తాను వెళ్లి పోతానని అర్జున్ చెప్పినట్టు స్పష్టంచేశారు.
సోషల్ మీడియా విపరీతంగా విస్తరించిన ఈ రోజుల్లో ఏ వార్త అయినా క్షణాల్లో తెలిసే ఈ కాలంలో.. ఒక మహిళ చనిపోతే, పైగా ఆయన సినిమాకు వచ్చిన తొక్కి సలాటలో మరణిస్తే బన్నీకి తెలియకుండా ఉంటుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నా రు. ఆ వార్తను యూట్యూబ్, మెయిన్‌స్ట్రీమ్ మీడియా బ్రేకింగ్‌లతో ప్రసారం చేశాయని చెప్తున్నారు.
* అర్జున్ చెప్పిన మరో విషయం కూడా నమ్మశక్యంగా లేదంటూ నెట్టింట మండిపడుతున్నారు. థియేటర్ బయట క్రౌడ్ బాగా ఉందని, వెంటనే వెళ్లిపోవాలని తన టీమ్ చెప్పితే.. తాను థియేట ర్‌కు వచ్చిన కొద్దిసేపటికే వెళ్లిపోయానని బన్ని చెప్పారు. కానీ ఆయన సినిమాలో జాతర సీన్ వరకు ఉన్నారని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలంటూ నెటిజన్లు వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తూన్నారు.
* బన్నీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఇంకో విషయంపై వివాదాస్పదంగా మారింది. ప్రమాదం వల్ల తాను 15 రోజులుగా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. అయితే, ఈ నెల 12న అర్జున్ ఢిల్లీలో సక్సెస్‌మీట్‌కు హాజరయ్యారు. ఇది మరో అబద్ధం అంటూ ఢిల్లీలో ఆయన పాలొన్న ఈవెంట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు.
* ప్రమాదం తర్వాత బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తానని అర్జున్ ప్రకటించారు. అయితే ఇందులో రేవతి కుటుం బానికి రూ.10లక్షలు మాత్రమే ఇచ్చారని, వారు బన్నీకి వ్యతిరేకమవుతారన్న ఉద్దేశంతో మిగతా రూ.15 లక్షలు ఇవ్వకుండా ఆపారంటూ మరికొందరు ఫైర్ అయ్యారు.
* ఆ రోజు థియేటర్‌లో పోలీసులు తనను కలవలేదు, ఏం చెప్పలేదని బన్నీ అన్నా రు. కానీ, పోలీసులు ఆయనకు సమా చారం ఇచ్చినట్టు ఓ అధికారి థియేటర్ లోకి వెళ్లిన వీడియోలను నెటిజన్లు షేర్ చేశారు.
* అసెంబ్లీలో అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చా రు. అప్పటిదాక ఏం జరిగిందో వివరించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబా నికి బాసటగా సీఎం స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంపై రాజీ పడేది లేదని వివరణ ఇచ్చారు. కానీ, దీనిపై బన్నీ అనవసరంగా ప్రెస్‌మీట్ పెట్టి అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా మాట్లాడారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
* అల్లు అర్జున్ థియేటర్‌లోకి వచ్చే ముందు చేసిన చర్యలు కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆయన పుష్ప సిగ్నేచర్ మూమెంట్ చేయడంతో అభిమానులు మరింత రెచ్చిపోయినట్టు స్పందిస్తున్నారు.