‘పుష్ప’ సినిమానే ఓ సంచలనమంటే.. ‘పుష్ప 2‘ మరో సంచలనంగా మారబోతోంది. టాలీవుడ్లో రాజమౌళి హీరోల పారితోషికం చాలా ఎక్కువ. అలాంటిది రాజమౌళి సినిమా ఒక్కటి కూడా చేయక ముందే అల్లు అర్జున్.. ఆయన హీరోలందరినీ.. ఆ మాటకొస్తే దేశంలోని హీరోలందరినీ దాటేసి టాప్ 1లో నిలిచారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప ది రూల్’ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 నటుల జాబితాను విడుదల చేసింది. దానిలో అల్లు అర్జున్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం.. ‘పుష్ప ది రూల్’కు అల్లు అర్జున్ రూ.300 కోట్లు తీసుకున్నారట. ఆ తరువాతి స్థానంలో తమిళ హీరో విజయ్ ఉన్నారు. ఆయన ‘విజయ్ 69’ కోసం రూ.275 కోట్లు తీసుకుంటున్నారట. తర్వాత వరుసగా షారుక్ ఖాన్ రూ.150 కోట్లు, రజినీకాంత్ రూ.150 కోట్లు, ఆమిర్‌ఖాన్ రూ.100 కోట్లు, ప్రభాస్ రూ.100 కోట్లు, అజిత్ రూ.105 కోట్లు, సల్మాన్ రూ.100 కోట్లు, కమల్ హాసన్ రూ.100 కోట్లు, అక్షయ్‌కుమార్ రూ.60 కోట్లు తీసుకుంటున్నారట. ‘పుష్ప 2’ కోసం రష్మిక రూ.10 కోట్లు, ఫహద్ ఫాజిల్ రూ.8 కోట్లు, స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల రూ.2కోట్లు తీసుకున్నారట.
ఐదేళ్ల ‘పుష్ప’ ప్రయాణం పూర్తయింది
‘పుష్ప ౨’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “చివరి రోజు షూటింగ్. అద్భుతమైన ఐదేళ్ల ‘పుష్ప’ ప్రయాణం పూర్తయింది” అని పేర్కొన్నారు.