17-03-2025 12:39:02 AM
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా గురించి ఏ అప్‌డేట్ వచ్చినా నెట్టింట అది వైల్డ్ ఫైర్‌ను సృష్టిస్తోంది. పుష్ప ఫ్రాంచైజీతో అంతలా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాడు అల్లు అర్జున్. 2021లో ‘పుష్ప’ విడుదల కాగా దానికి సీక్వెల్‌గా 2024లో వచ్చింది ‘పుష్ప ఈ రెండో భాగం చివరలో పార్ట్ కూడా ప్రకటించేశారు మేకర్స్.
అందుకే ఈ చిత్రం గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా అభిమానుల్లో ఆసక్తి నెలకొంటోంది. తాజాగా మూడో భాగం గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు చిత్ర నిర్మాత వై రవిశంకర్. ‘పుష్ప 2028లో విడుదల చేస్తామని వెల్లడించారాయన. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ‘రాబిన్‌హుడ్’ ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారారు ప్రొడ్యూసర్ రవిశంకర్.