బెన్‌ఫిట్ షో ధర రూ.800 n ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): డైరెక్టర్ సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప-2 చిత్ర నిర్మాతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ హోం శాఖ(జనరల్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
4వ తేదీ రాత్రి 9.30గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో బెన్‌ఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులిస్తూ టికెట్ ధర రూ.800గా నిర్ణయించింది. 5వ తేదన అర్ధరాత్రి ఒంటిగంట, ఉదయం నాలుగు గంటలకు అదనంగా ఆరు, ఏడు షోలను ప్రదర్శించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టికెట్ ధరలను (8వ తేదీ వరకు) సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచకోవచ్చని.. అన్నింటికీ జీఎస్టీ వర్తిస్తుందని వెల్లడించింది. ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.