సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప-2 టికెట్ ధరల పెంపుపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు.. సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు..?, ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?, ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?, అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే అన్నారు. అలా అనుకొని వారు సినిమా చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. పుష్ప-2 డిసెంబర్ 4 సాయంత్రం ప్రీమియర్లను ప్రదర్శిస్తుంది. చిత్ర నిర్మాతలు ఢిల్లీ, ముంబైలోని కొన్ని థియేటర్లలో టిక్కెట్ ధరలను పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా రామ్ గోపాల్ వర్మ వారి నిర్ణయాన్ని సమర్థించారు.