calender_icon.png 29 November, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పుష్ప చెప్పాడు!

29-11-2024 12:00:00 AM

పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచాలన్నా, సినిమాకు ప్రత్యేక అనుమతులు కావాలన్నా ఆ సినిమాలోని ప్రధాన నటీనటులతో ప్రజల్లో చైతన్యం కలిగించేలా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలవుతున్న సంగతి విదితమే. దీంతో ఆ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్.. తాజాగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ వీడియో చేశారు. పుష్ప టీమ్ ఈ వీడియోను ‘మన పుష్పన్న ఎప్పుడో చెప్పాడ్రా..’ అంటూ ప్రమోషన్‌లా ప్లాన్ చేయడం విశేషం.

ఈ  వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో ఆఖరున అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 కి కాల్ చేయండి. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం వాళ్లను శిక్షించడం కాదు.. వాళ్లకు హెల్ప్ చేయడం’ అని చెప్పారు. ఈ వీడియోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

రన్ టైం 3 గంటల 20 నిమిషాలు

‘పుష్ప 2’ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి అయింది. సెన్సార్ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం 5 మార్పులు చెప్పిన సెన్సార్ బోర్డ్.. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మార్పులకు మూవీ టీమ్ అంగీకరించింది. ‘పుష్ప 2’ రన్ టైం మొత్తం 3 గంటల 20 నిమిషాల ౩౮ సెకన్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  

మలయాళీ హుక్ లైన్‌తోనే పాట

అల్లు అర్జున్ కథానాయకుడిగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప-2: ది రూల్’. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 5న చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. మేకర్స్ కొచ్చిలో ఈవెంట్ ఏర్పాటుచేసింది. కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘మల్లు అర్జున్ అంటూ నాకు మీరిచ్చిన ఈ గ్రాండ్ వెలకమ్ మరిచిపోలేనిది.

20 ఏండ్ల నుంచి మీరు నాపై ప్రేమ చూపిస్తు న్నారు. ఈ సినిమా కెరీర్‌లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రంలో మలయాళ గొప్ప నటుడు ఫహాద్ ఫాజిల్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ‘ఆర్య’ చిత్రంతోనే కేరళలో నా మార్కెట్ స్టార్ట్ అయ్యింది. దర్శకుడు సుకుమార్ వల్లే నేను మీకు దగ్గరయ్యాను. మలయాళీ ఫ్యాన్స్ ఆర్మీ అనే పదాన్ని స్టార్ట్ చేశారు. అందుకే ఈ సినిమాలో మలయాళ లిరిక్స్‌తో సాంగ్ చేశాం. మలయాళ ప్రేక్షకులకు ఈ రూపంలో ప్రేమ చూపిస్తున్నాను.

ఆరు భాషల్లో ఈ పాట మలయాళంలోనే హుక్ లైన్ ఉంటుంది. డిసెంబర్ 5న 11 వేలకు పైగా థియేటర్‌లో విడుదలవుతోంది..’ అన్నారు. రష్మిక మందన్నా మాట్లాడుతూ ‘మీ స్వాగతం చూసి నా మైండ్ బ్లాంక్ అయ్యింది. మీ ప్రేమకు ఫిదా అయిపోయాను. అల్లు అర్జున్ మీద మీ ప్రేమ వెలకట్టలేనిది. అల్లు అర్జున్ నా జీవితంలో ఎప్పుడూ స్పెషల్ పర్సన్. నాకు  కుదిరితే కొచ్చి వచ్చి మీతో కలిసి సినిమా చూస్తాను. కేరళతో నా అనుబంధం చాలా గొప్పది. మీరంటే నాకు ఎంతో ప్రేమ’ అన్నారు. కార్యక్రమంలో నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.