25-02-2025 10:23:47 PM
పటాన్ చెరు: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఎన్నికైన రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ మంగళవారం సర్టిఫికెట్ అందుకున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పుష్ప నగేష్ కు స్టాండింగ్ కమిటీ మెంబర్ సర్టిఫికెట్ ను అందజేశారు. సర్టిఫికెట్ అందుకున్న సందర్భంగా పుష్ప నగేష్ మేయర్, డిప్యూటీ మేయర్ లకు పూల మొక్కను అందజేసి ధన్యవాదాలు తెలిపారు.