అంతటా పుష్ప మేనియా కనిపిస్తోందిప్పుడు. అల్లు అర్జున్ కథా నాయకుడిగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప : ది రూల్ 2’. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే 4వ తేదీ అంటే.. బుధవారం రాత్రే ముందస్తు ప్రదర్శనలతో పుష్పరాజ్ సందడి మొదలైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం..
* అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది.
* రూ.500 కోట్ల బడ్జెట్‌తో షూటింగ్ మూడేళ్లపాటు జరిగింది.
* సినిమా మొత్తం రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు. అలా అత్యధిక నిడివి ఉన్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా చేరింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
* ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది.
* ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్ల పారితోషికం తీసుకున్నారట. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుల జాబితాలో ఆయన ప్రథమ స్థానంలో నిలిచారని పేర్కొంటూ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ఇటీవల ప్రకటించింది.
* ‘పుష్ప2’లో గంగమ్మతల్లి జాతర సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని టాక్. ఇందులో బన్నీ మాతంగి వేషధారణలో కనిపించనున్నారు.
* దాదాపు 30 రోజుల పాటు షూట్ చేసిన ఈ ఒక్క జాతర సీక్వెన్స్ కోసమే మేకర్స్ ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు పెట్టారు.
* రష్మిక ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. మొదటి భాగంతో పోలిస్తే పార్ట్2లో తన రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని రష్మిక పలు సందర్భాలు చెప్పింది. ఆమె ఈ ప్రాజెక్టు కోసం రూ.10 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం.
* ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్‌గా కనిపించిన మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ పాత్ర నిడివి పార్ట్1లో చాలా తక్కువ. రెండో భాగంలో ఆయన నటన ఫస్ట్ హాప్‌లో అద్భుతంగా ఉంటుందని అల్లు అర్జున్ కితాబిచ్చారు.
* శ్రీలీల ‘కిస్సిక్’ సాంగ్ విడుదలైన 18 గంటల్లోనే 25 ప్లస్ మిలి యన్ వ్యూస్ వచ్చిన తొలి దక్షిణాది పాట అయింది.
* పుష్ప2 బుకింగ్స్ ఆరంభమవ్వడం తోనే బుక్‌మై షోలో 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదే.
* ప్రీ సేల్స్ రూపంలోనే రూ.100 కోట్ల మైలురాయిని అధిగమించింది.
* విదేశాల్లోనూ ప్రీ సేల్ బుకింగ్స్ రూపేణా అత్యంత వేగంగా 50 వేల టికెట్లు అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప౨’ రికార్డు సృష్టించింది.
* అమెరికాలో వెయ్యికిపైగా ప్రాంతాల్లో 65 వేలకు పైగా టిమెట్లు అత్యంత వేగంగా అమ్ముడైనట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి.
* హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో 24 గంటల్లో లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఘనతతో బాలీవుడ్ ఆల్‌టైమ్ టాప్ చిత్రాల జాబితాలో ‘పుష్ప2’కు మూడో స్థానం దక్కటం విశేషం.
* 12 వేలకు పైగా స్క్రీన్లలో వివిధ ఫార్మాట్లలో విడుదలవుతున్న ‘పుష్ప2’ 3డీ వెర్షన్‌లో రావడంలేదు. ఈ మూవీని 3డీ వెర్షన్ అనుగుణంగానే షూట్ చేసినప్పటికీ అందుకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవటంతో ప్రస్తుతం అన్నిచోట్లా 2డీ వెర్షన్‌నే అందుబాటులోకి తెస్తున్నారు.
* మొత్తం ఏడు ఫార్మాట్లలో అంటే.. ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీల్లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.