calender_icon.png 6 January, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్పకు షరతులతో బెయిల్

04-01-2025 02:12:22 AM

సంధ్య థియేటర్ కేసు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఎట్టకేలకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయనకు షరతులతో బెయిల్ మంజూరైంది. ప్రతి ఆదివా రం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, రెండు రూ. 50 వేల పూచీకతులను ఇవ్వాలని, విచారణకు సహకరించాలనే షరతులను కోర్టు విధించింది.

డిసెంబర్ 4న పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటు  ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణా పాయ స్థితిలో దవాఖానలో చేర్చాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ముందుగా సంధ్య థియే టర్ యాజమాన్యం, అక్కడ పనిచేసే సిబ్బంది ముగ్గురిపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అనేక పరిణామాల క్రమంలో అల్లు అర్జున్‌ను సైతం ఏ 11గా చేర్చారు.

దీంతో డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు అదే రోజు చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలిం చారు. ఈ సమయంలో హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుచేయగా, మధ్యంతర బెయిల్‌ను మంజూరుచేసి రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని హైకోర్టు సూచించింది.

దీంతో నాం పల్లి కోర్టులో అల్లు అర్జున్ న్యాయవాది రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సమయంలో బెయిల్ మంజూరు చేయవద్దని చిక్కడపల్లి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది.