పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక
ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపోందిస్తాయి
కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపోందిస్తాయని కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతి అంత్య పుష్కరాల్లో శ్రీను బాబు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ స్నానాలు ఆచరించారు.
అనంతరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు. పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని శ్రీను బాబు అన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






