calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

14-04-2025 01:43:31 AM

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 13(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జేఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్ లో  నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఘనంగా సన్మానించి, ఆత్మీయ పలకరింపులు భావొద్వేగాల మధ్య సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలతో స్నేహితులు మునిగితేలారు.  ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో 1995 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఎల్లారెడ్డిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

కమ్యూనికేషన్ రంగం అభివృద్ధి చెందడంతో పాత స్నేహితుల సెల్ నెంబర్లు సేకరించిన స్థానిక మిత్రులు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సైతం ఈ సంబంధానికి ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు.  ఈ ఆత్మీయ సమయంలో పాల్గొన్న   గురువులు షర్ఫులక్,కిషన్ ,జగదీశ్వర్ , కిష్టయ్య, ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరిగా తమ చిన్ననాటి మధుర  స్మృతులను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.  ఈ సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ నిర్వాహ కమిటీ సభ్యులు జ్ఞాపికాలను అందజేశారు.