calender_icon.png 23 September, 2024 | 2:29 PM

పూర్ణాహుతి కార్యక్రమంలో అన్ని దోషాలు తొలగుతాయి

23-09-2024 12:15:32 PM

అమరావతి,(విజయక్రాంతి): తిరుమల ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్త కార్యక్రమాలు సాగుతున్నాయి. కాసేపట్లో పూర్ణాహుతి నిర్వహిచనున్నట్లు పండితులు తెలిపారు. దోష నివారణ ఆలయ యాగశాలలో శాంతి హోమం నిర్వహించి వాస్తు యాగం అనంతరం లడ్డూపోటు, విక్రయశాలలో వాస్తుశుద్ధి, శాంతి హోమం ముగిశాక పూర్ణహుతి నిర్వహిచనున్నట్లు పండితులు వెల్లడించారు. పూర్ణహుతి తర్వాత ఆలయంలోని అన్ని విభాగాల్లో పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 

బూందీ పోటు, లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటులో పంచగవ్య సంప్రోక్షణ, కల్తీనెయ్యితో కలిగిన అపరాధానికి శాంతి యాగం, సంప్రోక్షణ నిర్వహిస్తామని, ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహకులు పేర్కొన్నారు. స్వామివారికి మహానైవేద్యం పూర్తిచేశామని, పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేసినట్లు టీటీడీ తెలిపింది.  మార్చిన నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశామని,  పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం.. పవిత్రోత్సవాలతో పోయిందన్నారు. ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని, తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, సంప్రోక్షణతో పోయినట్లు టీటీడీ వెల్లడించింది.