జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్లో ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులకు సూచించారు. శుక్రవారం అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం పచ్చదనం’ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలి పారు.
షెడ్యూల్ మేరకు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కృషి చేయాలని తెలిపారు. ప్రజలకు ఉపయోగకరమైన మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నగరంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందేలా కార్యక్ర మాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు.