calender_icon.png 31 October, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో తెరుచుకోనున్న రత్న భాండాగారం రహస్య గది

18-07-2024 10:49:00 AM

భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది కాసేపట్లో తెరుచుకోనుంది. ఈ నెల 14న తొలి రెండు గదుల్లోని సంపద తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. రహస్య గది తెరుస్తున్న కారణంగా గురువారం ఉదయం భక్తుల ప్రవేశం నిలిపివేశారు. రహస్య గదిని తెరవడానికి పండితులు 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభ ముహూర్తం ఖరారు చేశారు. 46 సంవత్సరాల తర్వాత మరమ్మతుల కోసం రత్నభాండాగారం తెరుచుకుంటున్న విషయం తెలిసిందేజూలై 16న ఎస్ జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీ, జస్టిస్ బిస్వంత్ రాత్ (రత్న భండార్‌ను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక కమిటీ చైర్మన్), పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఇతర అధికారులు హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "మేము మళ్లీ తాళాలు తెరిచి, జూలై 18న ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య రత్న భండార్‌లోకి ప్రవేశిస్తాము. లోపలి గదిలోని విలువైన వస్తువులు తాత్కాలిక స్టోర్‌రూమ్‌కి మార్చబడతాయి. ఏఎస్ఐ సభ్యులు దాని నిర్మాణ స్థిరత్వాన్ని కూడా అంచనా వేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం వీడియో తీయబడుతుంది" అని జస్టిస్ రాత్ తెలిపారు.