calender_icon.png 21 January, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూరి జగన్నాథ్ గన్ లాంటివాడు

12-08-2024 12:00:00 AM

‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్ 

హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కావ్య థాపర్ నటించింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో ఆదివారం హనుమకొండలోని జేఎన్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో రామ్ మాట్లాడుతూ.. “ఇస్మార్ట్ శంకర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఇక్కడికి వచ్చాం. మళ్లీ ‘డబుల్ ఇస్మార్ట్’ ఈవెంట్‌కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా ఉంది.

పూరి గారితో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. పూరి గన్ లాంటివారు.. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత ఫోర్స్‌గా అయినా వెళ్తుంది. పూరి గారి లాంటి గన్ యాక్టర్స్ అందరికీ కావాలి. ‘డబుల్ ఇస్మార్ట్’ మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు” అన్నారు. డైరెక్టర్ పూరి మాట్లాడుతూ.. “మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ అవ్వవ్. డబుల్ ఇస్మార్ట్ గురించి మాట్లాడాలంటే, ఒకే ఒక పేరు.. రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ. రామ్‌ని సెట్స్‌లో చూసినపుడు కసి కనిపిస్తుంటుంది.

అది నన్ను చాలా ఎక్సయిట్ చేస్తుంది. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజు బాబాకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఈ సినిమాలో చేయడం కొత్త కలర్ తీసుకొచ్చింది. కావ్య తెలుగులో డబ్బింగ్ చెప్పింది. నా దగ్గర రూపాయి లేకపోయినా రోడ్డుమీద ఉన్నా నేను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నా వెనుక విషు నిల్చొని ఉంటాడు. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి.. విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు కథ చెప్తారా? అని అడిగారు.

మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఏవైనా చేస్తుంటారు తీసే ముందు ఒకసారి చెప్పండని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో చాలా ఎమోషనల్ అయిపోయాను. నామీద ఆయనకి ఉన్న ప్రేమ అలాంటిది. అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకొని తీసిన తర్వాత ఆయన్ని కలుద్దామని చెప్పలేదు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్, నిర్మాత ఛార్మి, పూరి కనెక్ట్స్ సీఈవో విష్, నటులు అలీ, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ మాట్లాడి తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.