calender_icon.png 9 February, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఒక పథకం ప్రకారం’ అందరికీ రీచ్ అయ్యింది

08-02-2025 11:28:10 PM

పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విహాన్ ఫిల్మ్స్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు విడుదల చేశారు. సినిమాకు వస్తున్న స్పందన పట్ల యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణను చూసిన చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా సాయి రామ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. “ఒక పథకం ప్రకారం’ సినిమాను చాలా చోట్ల రిలీజ్ చేశారు. చూసిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా ఉందని అంటున్నారు. మేం అనుకున్నట్టుగానే అందరికీ రీచ్ అయ్యింది. సముద్రఖని పాత్రకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. పెద్ద ఓపెనింగ్స్ అని చెప్పను గానీ.. మా కథ, మా సినిమా బలంగా ఉందని చెప్పగలను” అని అన్నారు. దర్శక, నిర్మాత వినోద్ విజయన్ మాట్లాడుతూ.. “ఒక పథకం ప్రకారం’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల నుంచి మాకు ఆదరణ లభిస్తోంది” అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గార్లపాటి రమేష్ కూడా పాల్గొన్నారు.