calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను దోపిడీ చేస్తున్న కొనుగోలు కేంద్రాలు

19-04-2025 02:05:02 AM

బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ 

మోతె, ఏప్రిల్18:- మండల కేంద్రంలోని ఐకేపి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన విధంగా కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని మిల్లర్ల పేరుతో అధిక మొత్తం లో కమిషన్ వసూలు చేసి రైతులను దోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బస్తాల పేరుతో కొంత ల్యాండ్ లీజు పేరుతో మరి కొంత తరుగుల పేరుతో రైతులను నిలువుదోపిడీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

కేంద్రాలు ప్రారంభించి సుమారు పది రోజులు గడుస్తున్న పలు కారణాల తో కాలయాపన చేసి రైతులు పండించిన పంటలు అకాల వర్షాలకు తడిసి పంటలు నష్ట పోయే ప్రమాదం ఉందని వెంటనే కేంద్రాలకు వచ్చిన ధాన్యం కంటా లు వేసి సమస్యలు లేకుండా పరిష్కారం చేయాలని అధికారులను కోరారు గడువు తీరిన మ్యాచర్ మిషన్లతో సక్రమంగా మ్యచర్ రావడం లేదని రెండు సంవత్సరాలు దాటిన మ్యాచర్ మిషన్లు తొలగించి సక్రమంగా పని చేసే వాటితో మ్యాచర్ చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు శంకర్ నాయక్, శ్రీను నాయక్, వెంకటేష్ బాబు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధర్మారెడ్డి, పెరుగు మధు,సైదానాయక్,  రంగా నాయక్, మల్సూర్, శ్రీకాంత్, సతీష్ రెడ్డి, బి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు