08-04-2025 01:01:34 AM
తహసీల్దారు లాలూనాయక్
పెన్ పహాడ్, ఏప్రిల్ 7 : రైతుల సౌకర్యార్ధమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, అక్కడ తమ పంటలను రైతులు దర్జాగా అమ్ముకోవచ్చని పెన్పహాడ్ తహసీల్దార్ లాలూనాయక్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మహ్మదాపురం, అనాజీపురంలో ఐకేపీ ఆద్వర్యంలో నిర్వహస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ డైరెక్టర్లు దామోదర్రెడ్డి, ఆర్తి కేశవులుతో కలసి ప్రారంభించారు.
ఈ సందనర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని కళ్లాల వద్దనే తూర్పారాబట్టి, ఆరబెట్టుకొని కేంద్రానికి తీసుకురావాలని కోరారు. నాణ్యమైన ధాన్యం అమ్మి మద్దతు ధరను పొందాలని సూచించారు. ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి, లారీల ద్వారా మిల్లులకు తరలించి అధికారులకు ట్రక్షీట్ల సమాచారం ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఈ కార్యక్రంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (మార్కెటింగ్) ఆంజనేయులు, ఏపీఎం అజయ్నాయక్, ఏవో అనిల్కుమార్, నిర్వాహకులు ధనలక్ష్మి, విజయ, అన్నమేరీ, నాగలక్ష్మి, ఇందిరమ్మ, ప్రమీల, శిరీష, ఏఈవో స్వప్న, సీసీ ఆశ తదితరులు పాల్గొన్నారు.