calender_icon.png 21 November, 2024 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు చేసిన దాన్యంను మిల్లులకు తరలించాలి

21-11-2024 02:12:39 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్

కామారెడ్డి, (విజయక్రాంతి): కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడారు. వరి పంటను శుభ్రం చేసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఎన్ని రోజులకు వరి పంటను కొనుగోలు కేంద్రం తీసుకువచ్చారని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని వారం రోజులు క్రితం తీసుకువచ్చామని రైతులు తెలిపారు. ఇప్పటివరకు 1877.20 క్వింటాళ్ల వరి పంటను 54 మంది రైతులు వచ్చి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దాంట్లో 45 మంది రైతులు వారి పంట 1652 క్వింటాలు రైస్ మిల్లులకు పంపడం జరిగిందని ట్యాబ్ ఎంట్రీ చేసినట్లు సేంటరి ఇంచార్జి తెలిపారు. మిగతావి లోడింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, జెడ్పి సీఈవో చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.