రెండో టీ20లో ఓడిన సూర్య సేన
గెబేహా: భారత్ మధ్య జరిగిన రెండో టీ20లో సఫారీలు 3 వికెట్ల తేడాతో విజయం సాధించారు. స్టబ్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరుణ్ చక్రవర్తి తిప్పేయడంతో భారత్ సులభంగా గెలుస్తుందని అనుకున్నా కానీ తర్వాత వచ్చిన సీమర్లు అర్షదీప్, ఆవేశ్ దారాళంగా పరుగులివ్వడంతో సఫారీలు విజయం సాధించారు. సౌతాఫ్రికా బౌలర్ కొయెట్జీ చివర్లో మ్యాచ్‌ను దూరం చేశాడు. వరుణ్ స్పిన్ వల్ల గెలిచేలా కనిపించినా కానీ 8వ వికెట్ పార్ట్నర్షిప్ భారత్ కొంపముంచింది.
4 టీ20ల సిరీస్‌లో రెండు జట్లు 1 తేడాతో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది. టాస్ గెలిచి న సఫారీలు మొదట బౌలింగ్ చేసి భారత్‌ను 124/6కే కట్టడి చేశారు. హర్దిక్ పాండ్యా (39*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. తర్వాత వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల ప్రదర్శనతో భారత్ గెలిచేలా సమీకరణం మారి నా స్టబ్స్ (47*), కొయెట్జీ (19*) ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేయడంతో మ్యాచ్ భారత్ నుంచి దూరం అయింది. మొదటి మ్యాచ్ సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు.